సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది, ముంబైలోని గోవండి ఏరియాలో ఆటోడ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఓ బైకర్ తనకి వార్నింగ్ ఇవ్వడం ఆటో డ్రైవర్ కి నచ్చలేదు, దీంతో టూ వీలర్ పై వెళుతున్న వ్యక్తికి సైడ్ నుంచి వచ్చి ఆటోకి ఎక్కించాడు, కొంచెంలో అతని ప్రాణాలు పోయేవి.
ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు అయింది.. దీంతో ఆటోవాలని పోలీసులు అరెస్ట్ చేశారు.
డిసెంబర్ 17న చోటుచేసుకుంది ఈ దారుణం , కాని ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. సయ్యద్ సల్మాన్ అనే ఆటోడ్రైవర్ డిసెంబర్ 17న గోవండి ఏరియాలో ఆటోను ర్యాష్ గా నడిపాడు.
బైక్ పై వెళ్తున్న కార్తిక్ అనే వ్యక్తిని ఢీకొట్టాడు. అలాగే సయ్యద్ ముందుకు వెళ్లిపోయాడు. దీనిపై బైకర్ ప్రశ్నించాడు, ఇక సిగ్నల్ రిలీజైన్ తర్వాత బైక్ ని మరోసారి గుద్ది అతను కిందపడేలా చేశాడు, హెల్మెట్ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే పెను ప్రమాదం జరిగేది, ఆ వీడియో మీరు చూడండి.
వీడియో లింక్..