ఈ ఏడాది భోగి పండుగ జనవరి 13న వచ్చింది, ఇక 14న సంక్రాంతి, 15న కనుమ. 16న ముక్కనుమ జరుపుకుంటాం, అయితే ఈ నాలుగు రోజులు కచ్చితంగా దేవాలయాలకు వెళ్లాలి… ఆ స్వామిని కొలవాలి, అంతేకాదు సూర్య భగవానుడ్ని కొలవడం వల్ల ఎలాంటి ఆర్దిక ఇబ్బందులు ఉండవు… ముఖ్యంగా పేదలకు దానం చేస్తే చాలా మంచిది.
ఇక సంక్రాంతి భోగి రోజు కచ్చితంగా తలారా స్నానం చేయాలి
మీకు నచ్చిన దైవాన్ని కొలవాలి సూర్యుడ్ని కొలవాలి.
శివుడు విష్ణుమూర్తి ఆలయాలు దర్శించండి.
సూర్యుడికి నివేదన చెయ్యండి.
ఉదయం లేచి దీపం వెలిగించి హారతి ఇవ్వండి
శివుడికి అభిషేకం చేయిస్తే ఎంతో మంచిది సంక్రాంతి రోజున
ఇక విష్ణు ఆలయంలో అర్చన ఎంతో మంచిది.
ఇక పేదలకు, లేని వారికి బట్టలు నగదు ఇవ్వడం, ఆహారం అందించడం ద్వారా ఆ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది..నల్లని దుస్తులు ధరించవద్దు, ఈ నాలుగు రోజులు వివాదాలు పెట్టుకోకూడదు..