ఇప్పుడు అంతా టెక్నాలజీ ఈజీగా నగదు ట్రాన్స ఫర్ చేస్తున్నాం.. అలాగే ఈజీగా నగదు బదిలీతో పాటు లావాదేవీలు చేస్తున్నాం.. కాని గతంలో ఇంత వేగంగా ప్రక్రియ జరిగేది కాదు.. అంతా ఆన్ లైన్ మహిమ… అయితే చాలా మందికి ఒకటికి మించి రెండు లేదా నాలుగు ఐదు బ్యాంకు ఖాతాలు ఉంటాయి… అయితే ఖాతా తీసుకోవడం ఈజీ కాని అందులో బ్యాలెన్స్ మినిమం మెయింటైన్ చేయాలి లేకపోతే ఫైన్లు పడతాయి.
అలాగే కొత్త ఉద్యోగాల్లో చేరిన సమయంలో ఆ కంపెనీ ఒక్కో శాలరీ అకౌంట్ ఇస్తుంది.. ఇలా అనేక బ్యాంకుల్లో శాలరీ అకౌంట్లు కంపెనీ మారినప్పుడల్లా కొత్తవి ఉంటాయి…అయితే ఆకంపెనీ మారిన తర్వాత పాత బ్యాంకు ఖాతా క్లోజ్ చేయరు దీని వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి.
ఇక మీరు కంపెనీ మారితే పాత కంపెనీ ఇచ్చిన బ్యాంకు అకౌంట్ వాడకపోతే వెంటనే మీరు ఆ బ్యాంకుకు వెళ్లి క్లోజింగ్ ఫామ్ తీసుకోండి.. ఆ బ్యాంకు ఖాతా క్లోజ్ చేసుకోండి, దీని కోసం మినిమం కొంత నగదు కట్టించుకుంటాయి కొన్ని బ్యాంకులు,
ఆ బ్యాంక్ సంబంధించిన చెక్ బుక్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డును బ్యాంకులో జమ చేయాలి. మీరు ఆ అకౌంట్ కు సంబంధించి ఈ ఎంఐ ఉంటే దానిని వేరే బ్యాంకుల ఖాతాలకు మార్చుకోవచ్చు.