దేశంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ శాఖలు విలీనం అయిన సంగతి తెలిసిందే, అయితే కచ్చితంగా ఈ బ్యాంకు ఖాతాదారులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని రూల్స్ అయితే మారనున్నాయి. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ వినియోగదారులు కొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్లు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంఐసీఆర్ కోడ్లు కూడా మారతాయి.
అంతేకాదు ఈ బ్యాంక్ కస్టమర్లు కొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్, కొత్త ఎంఐసీఆర్ కోడ్ కలిగిన కొత్త చెక్ బుక్స్ తీసుకోవాల్సి ఉంటుంది.. పాతవి ఈ నెల 31 వరకూ మాత్రమే పని చేస్తాయి.ఐఎఫ్ఎస్సీ, ఎంఐసీఆర్ కోడ్లు 2021 మార్చి 31 వరకే పనిచేస్తాయి. మీరు కొత్త చెక్ బుక్ కావాలి అని అనుకుంటే మీకు ఉన్న బ్యాంకు యాప్ ద్వారా మీరు పొందవచ్చు..మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక మరో విషయం ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ యూజర్లు యూనియన్ బ్యాంకుకు మారినా అకౌంట్ నెంబర్లలో ఎలాంటి మార్పు ఉండదు….మీకు ఏ బ్యాంకు కస్టమర్ ఐడీ ఉంటుందో అదే ఉంటుంది బ్యాంకు వారు కొత్త చెక్స్ ఇస్తారు ఇవి అప్లై చేసుకోండి.
మీకు ఇంకా దీనిపై అనుమానాలు ఉంటే యూనియన్ బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్లు 1800 208 2244 కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
ReplyForward
|