ఓపక్క రెయినీ సీజన్ ఈ సమయంలో సాధారణ జ్వరాలు జలుబు వస్తాయి, అయితే ఈ సమయంలో కరోనా ఉండటంతో ఏది కరోనా ఫీవర్ ఏది సాధారణ ఫీవర్ అనేది తెలియడం లేదు, అయితే కరోనా సమయంలో కొందరికి ఫీవర్ వచ్చి తర్వాత పరీక్ష చేయించుకుంటే కరోనా అని తేలుతోంది, దీంతో చాలా మంది తీవ్ర ఆందోళన చెంతుతున్నారు, అంతేకాదు ఈ సమయంలో డెంగ్యూ వ్యాధి కూడా చాలా మందికి సోకుతోంది.
వర్షాలకు దోమలు స్వైర విహారం చేయడం మొదలు పెడతాయి. చెత్త ద్వారా కూడా దోమల బెడద మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇలా డెంగ్యూ తీవ్రత బాగా పెరిగిపోతుంది. మరి నిజంగా శరీరంలో డెంగ్యూ వస్తే ఎలా తెలుస్తుంది అంటే విపరీతమైన నీరసం ఉంటుంది, అంతేకాదు కీళ్ల నొప్పులు ఉంటాయి.
జ్వరం రావడం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, వికారం, వాంతులు, చర్మంపై దద్దుర్లు, దురద వంటి లక్షణాలు వారం పైనే కనిపిస్తాయి, జ్వరం అస్సలు తగ్గదు, ఈ లక్షణాలు కనిపిస్తే డెంగ్యూ అని అనుమానించాల్సిందే..జ్వరం తీవ్రత ఒక్కో సారి 105 డిగ్రీల వరకు కూడా ఉండవచ్చు. . వస్తే ఆకలి వేయదు. రుచిని గ్రహించలేరు. అలాగే డెంగ్యూ వచ్చిన వారిలో బీపీలో తగ్గుదల ఉంటుంది.