మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మన భారతీయులందరూ ఆదరించే ఒక గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయనని జాతిపిత అని పిలుస్తారు,. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు.
అందుకే ఆయనని మనం నిత్యం గుర్తు చేసుకుంటాం ప్రతీ పనిలో మనతో ఉన్నారు అని భావిస్తాం, అయితే ఆయనకి మనం ఎంతో గౌరవం ఇస్తున్నాం, అంతేకాదు మన కరెన్సీ పై కూడా గాంధీగారి ఫోటోనే ఉంటుంది, అయితే మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కరెన్సీపై మూడు సింహాల చిహ్నాన్ని ముద్రించారు. తర్వాత భారత కరెన్సీపై తంజావురు గుడి గేట్ వే ఆఫ్ ఇండియా లాంటివి మన కరెన్సీ నోట్లపై ఉండేవి.
అయితే గాంధీగారి ఫోటో ఎప్పుడు ముద్రణ ప్రారంభం అయింది అనేది చూస్తే.. 1969లో గాంధీ శత జయంతి సందర్భంగా ఆయన చిత్రంతో 5 రకాల నోట్లను దేశంలో చెలామణిలోకి తెచ్చారు..
1987 తరువాత ఎక్కువగా గాంధీ నోట్లు మాత్రమే వచ్చాయి. చివరకు 1996లో ఆర్బీఐ పూర్తిగా మహాత్మాగాంధీ ఫొటోలతోనే గాంధీ సిరీస్ నోట్లను ఆవిష్కరించింది. ఆనాటి నుంచి కరెన్సీపై నేటికి ముద్రణ జరుగుతోంది.