కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మ ఎలా వచ్చిందో తెలుసా?

Do you know how the Gandhi doll came to be on currency notes?

0
95

కరెన్సీ నోట్లపై గాంధీజీ బొమ్మ ఉంటుంది. అలా మహాత్మా గాంధీ ఫోటోతో నోట్లు ముద్రించడాన్ని మహాత్మాగాంధీ శ్రేణి అంటారు. కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ బొమ్మ నవ్వుతూ ఉండడాన్ని గమనించారా? కరెన్సీ నోట్ల మీద అది గాంధీజీ ఫోటో వెనుక ఉన్న కథ గురించి తెలియదు. అదేంటి అనేది ఇప్పుడు చూద్దాం.

ఏమాత్రం కల్మషం లేకుండా ఆనందంగా నవ్వుతున్న గాంధీ తాత ఫోటోని మనం కరెన్సీ నోట్ల మీద చూడొచ్చు. అయితే ఈ ఫోటోను 1946వ సంవత్సరంలో గుర్తు తెలియని ఫోటోగ్రాఫర్ తన కెమెరా లో బంధించాడు. కలకత్తా లోని వైస్రాయ్ భవన్ లో బ్రిటిష్ సెక్రెటరీ లారెన్స్ అనే వ్యక్తిని 1946వ సంవత్సరంలో మహాత్మాగాంధీ కలవడానికి వెళ్లడం జరిగింది.

అప్పుడు ఈ ఫోటోలు తీశారట. ఆ ఫోటోను వైస్రాయ్ భవనం నుంచి మనవాళ్లు తీసుకు రావడం జరిగింది. కరెన్సీ నోట్ల మీద ముద్రించడానికి అనుకూలంగా దానిని మార్చి ముద్రించారు. మహాత్మాగాంధీ ఫోటోకు మిర్రర్ ఇమేజ్ ను మొదటి సారిగా 1987లో 500 నోట్లపై ముద్రించడం జరిగింది. గాంధీజీ సిరీస్ నోట్లు 1996వ సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చాయి. అయితే అప్పటి చిత్రం ఇప్పటి నోట్ల మీద కూడా ముద్రిస్తున్నారు. అలా ఆ పాత చిత్రమే ఇంకా కరెన్సీ నోట్ల మీద ముద్రిస్తున్నారు.