మన తెలుగు వారు జరుపుకునే పెద్ద పండుగల్లో అతి పెద్ద పండుగ సంక్రాంతి, నాలుగు రోజులు మనం ఈ పండుగ జరుపుకుంటాం.. అయితే మన దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఈపండుగ జరుపుకుంటారు… మరి ఎవరు ఎలా జరుపుకుంటారు.. ఏ స్టేట్ లో ఏ పేరుతో సంక్రాంతి జరుగుతుంది అనేది చూద్దాం.
తెలుగువారు సంక్రాంతిగా చేసుకుంటారు
బెంగాల్లో వారు పౌష్ సంక్రాంతి అంటారు
తమిళనాడులో పొంగల్
గుజరాత్లో ఉత్తరాయణ్
అసోంలో భోగాలీ బిహు
కర్ణాటకలో మకర్ సంక్రమణ్
కాశ్మీర్లో షాయ్నీ క్రాత్
కోల్కతాలో గంగా సాగర్ మేళా చేస్తారు
పంజాబ్ హర్యానాలో లోహ్రీగా జరుపుకుంటారు
కేరళలో మకర విళక్కు
ఈ మూడు రోజులలో మొదటి రోజు భోగిమంటలతో పండుగ చేస్తారు, రెండవ రోజు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతల, దేవుళ్ళ పూజలతో, మూడవ రోజు గో పూజలతో పండుగ చేసుకుంటారు.