సీతా ఫలం, రామ ఫలం మీకు తెలుసు మరి లక్ష్మణ ఫలం గురించి ఎప్పుడైనా విన్నారా, సో ఇప్పుడు మనం ఈ ఫలం గురించి తెలుసుకుందాం..లక్ష్మణ ఫలం చెట్టు అనోనేసి కుటుంబానికి చెందిన చెట్టు. సీతాఫలం చెట్టు ఆకులు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి ఈ చెట్టు ఆకులు. అయితే మన దేశంలో కాదు కాని ఎక్కువగా అమెరికా, కరేబియన్, ఉత్తర దక్షిణ అమెరికా, కొలంబియా, బ్రెజిల్,పెరూ, వెనిజులా ప్రాంతాల్లో ఎక్కువగా పండుతాయి.
ఇవి చాలా దట్టమైన అడవుల్లో బాగా కనిపిస్తాయి, అమెజాన్ అడవుల్లో ఎక్కువగా ఉంటాయి, ఈ కాయలు మనం తినవచ్చు, అయితే బాగా పండి పక్వానికి వచ్చిన పండ్లు మాత్రమే తీసుకోవాలి .. మరో విషయం ఏమిటి అంటే సీతాఫలం, రామఫలం వలె కాకుండా లక్ష్మణ ఫలంలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది.
లక్ష్మణ ఫలంలో 12 రకాల కేన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధగుణాలు ఉన్నట్లు పరిశోధకులు తెలుసుకున్నారు.
ఈ చెట్టు బాగాలు కొన్ని ఆయుర్వేద ఇంగ్లీష్ మెడిసన్ తయారీకి వాడతారు అని చెబుతున్నారు పరిశోధకులు..
అమెరికాలోని అమెజాన్ అడవుల్లో నివసించే ఆటవికులు వందల సంవత్సరాలుగా ఈ చెట్టు బెరడును, ఆకులను, వ్రేళ్ళను, పూలతో సహా విత్తనాలను సైతం వివిధ వ్యాధుల చికిత్సకు వినియోగిస్తున్నారు. ఇక మన ప్రాంతంలో చూసుకుంటే ఇవి ఎక్కువగా తమిళనాడు ప్రాంతంలో కనిపిస్తాయి. ఇప్పుడు ఉత్తరాంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో పండిస్తున్నారు. ఇవి రేటు కూడా ఎక్కువగానే ఉంటాయి కిలో కాయలు 1400 రూపాయల వరకూ రిటైల్ మార్కెట్లో ఉంటాయి.