మనం ఎన్నో రకాల చెట్లు చూసి ఉంటాం.. అయితే ఎండ వచ్చినా వర్షం వచ్చినా ఆ చెట్టు నీడన ఉంటాం, ఇక పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అంటే గుడారాలు కూడా వేసుకుంటారు వాటి కింద.. అంతేకాదు అనేక చిన్న చిన్న చెట్లు మొక్కలు కూడా దాని కింద బతుకుతాయి.. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. అసలు మన ప్రపంచంలో అతి పెద్ద చెట్టు ఎక్కడ ఉంది అని.. పైగా ఆ చెట్టు ఏమై ఉంటుంది అని.. సో అది ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో అయితే గుజరాత్లోని కబీర్ వాద్ ఉంది.. అక్కడ చాలా ఎత్తైన ప్రాచీన చెట్లు ఉంటాయి. ఇక మన ప్రపంచంలో అతి పెద్ద చెట్టు చూద్దాం.. ఇది ఉత్తర అమెరికా… కాలిఫోర్నియా రాష్ట్రంలోని రెడ్ వుడ్ నేషనల్ పార్కులో ఉంది. దీని ఎత్తు ఎంతో తెలుసా 115.85 మీటర్లు.
380 అడుగులు ఉంటుంది పొడుగు చూసుకుంటే. ఇది అమెరికా న్యూయార్క్లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే ఎత్తైనది. కోనిఫెరస్ కోస్ట్ రెడ్ జాతి చెట్టుగా పరిశోధకులు చెబుతున్నారు. దీని పేరు ఏమిటి అంటే హైపెరియన్.. దీనిని గిన్నీస్ బుక్లో 2006లో ఎత్తు అయిన చెట్టుగా పేరు ఎక్కించారు.