వక్క మనం పండుగలు ఫంక్షన్లు ఇలా జరిగిన సమయంలో ఇంటికి తెస్తూ ఉంటాం, అంతేకాదు ఇక తాంబూలం వేయాలన్నా తమలపాకులో వక్క ఉండాల్సిందే, వక్కపొడికి వక్కకు ఎంతో పేరు ఉంది ప్రాధాన్యత ఉంది, అయితే అతిగా తింటే చేటు కాని మితంగా అప్పుడప్పుడూ తీసుకుంటే శరీరానికి మంచిదే.
వక్క కిలో 500 రూపాయలు ధర పలుకుతోంది. ముఖ్యంగా పాత వక్కలు కిలో 500 ధర ఉన్నాయి, వీటికి డిమాండ్ ఎక్కువ, కొత్త వక్కలు 450 నుంచి 400 ధర ఉంటాయి కిలో.. గతంలో కిలో 270 ఉండే వక్క ఈ లాక్ డౌన్ వేళ భారీగా ధర పెరిగింది. ఇక ప్రపంచంలో మన దేశంలోనే వక్క అత్యధికంగా పండిస్తారు… మన తర్వాతే మరే దేశం అయినా ఉంది…మనం ముందు ఉన్నాం వక్క పండించే దేశాల్లో.
మన దేశంలో కర్ణాటక, కేరళ, అస్సోం రాష్ట్రాలు వక్క తోటల సాగు జరుగుతోంది, ఇక ఈ వక్క ఎక్కువగా మలేషియా వియత్నాం నుంచి తినడం అలవాటు అయింది..అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో వక్క తోటలు ఉన్నాయి. ఇక ఎకరానికి 450 వక్క చెట్లు వేస్తారు, ఐదు సంవత్సరాలకు పంట వస్తుంది..ఒక్కో చెట్టు నుంచి గరిష్టంగా 100 కేజీల వరకూ పచ్చి వక్క కాయలు వస్తాయి.. అందులో నుంచి 30 శాతం వక్క వస్తుంది. అదండి వక్కస్టోరీ