ప్రకృతి లో పచ్చని చెట్లు చూస్తే ఎవరికి అయినా ఆనందం కలుగుతుంది.. మనసు ఉల్లాసంగా ఉంటుంది. చెట్ల దగ్గర ఉంటే ఎలాంటి ఒత్తిడి మనిషికి ఉండదు, అంతేకాదు పచ్చని గ్రీనరీ ఉన్న చోట మనం ఉంటే ఆక్సిజన్ బాగా అందుతుంది.. అంతేకాదు తలనొప్పి లాంటివి ఉన్నా తగ్గుతాయి. ఇలా ఇంట్రస్టింగ్ విషయాలు మొక్కల గురించి చెప్పుకుందాం.
మొక్కలు, చెట్ల మధ్య నడుస్తూ ఉంటే తలనొప్పి ఉన్నా కచ్చితంగా తగ్గుతుంది.. ఎందుకు అంటే ఆ చెట్లు ఇచ్చే ఆక్సిజన్ మీ బ్రెయిన్లోకి ఎక్కువగా వెళ్తుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది..సో మెదడులో కణాలు చల్లగా మారతాయి ..ఇక తలనొప్పి తగ్గుతుంది.
పెద్ద చెట్టు ఏదైనా రోడ్ సైడ్ ఉంటే దాదాపు అది ఏడాదికి 20 కేజీల దుమ్ము, 20 టన్నుల కార్బన్ డై-ఆక్సైడ్ని పీల్చేసుకుంటుంది. అంతేకాదు మనకు 700 కేజీల ఆక్సిజన్ ఇస్తుంది. బయట ఎండకి చెట్టు కింద మనం ఉంటే దాదాపు నాలుగు డిగ్రీలు తక్కువ ఎండ ఉంటుంది… ఇంట్లో ఐదు చెట్లు ఉంటే ఆక్సిజన్ బాగా వస్తుంది. ఇంటిలో వారికి ఆరోగ్యం ఉంటుంది. అందుకే మొక్కలు నాటండి.