చాయ్ అమ్ముకునే స్ధానం నుంచి ప్రధాని అయ్యే వరకూ నరేంద్రమోడీ ముందుకు సాగారు. ఆయన జర్నీలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ప్రశంసలు ఉన్నాయి. నరేంద్ర మోదీ 1950 సెప్టెంబర్ 17న గుజరాత్ లోని మెహ్సానా జిల్లా వాద్ నగర్లో జన్మించారు. వారిది అతి సాధారణ కుటుంబం. ఆయన తండ్రి టీ స్టాల్ లో ఆయనకు సహాయం చేసేవారు. మోదీ. తర్వాత సొంతంగా టీ స్టాల్ ఏర్పాటు చేసుకున్నారు.
ఆయన జీవితంలో కొన్ని కీలక ఘట్టాలు.
1971లో ఆయన ఆరెస్సెస్ లో ఫుల్ టైమ్ ప్రచారక్ గా చేరారు.
1987లో నరేంద్రమోదీ గుజరాత్ లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు
ఇలా అతి తక్కువ సమయంలో పార్టీలో కీలకంగా పనిచేశారు
2001 అక్టోబర్7న మోదీ గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
2002 లో గోద్రా అల్లర్ల నేపథ్యంలో విమర్శలు రావడంతో రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు.
ఇలా మోదీ నేతృత్వంలో గుజరాత్ లో బీజేపీ ముందుకు సాగింది.
బీజేపీ వరుసగా 2002, 2007, 2012 ఎన్నికల్లో విజయం సాధించింది సీఎంగా చేశారు మోదీ
2014లో మోదీ సారథ్యంలో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లిన బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆయన పీఎం అయ్యారు.
2019లో కూడా అధికారంలోకి వచ్చింది ఆయన పీఎం అయ్యారు
దేశంలో ఆయనంటే కోట్లాది మందికి అభిమానం. ఆయన చెప్పింది చేస్తారనే నమ్మకం ప్రజల్లో కలిగింది.