ప్రపంచ వ్యాప్తంగా టూరిస్టులు ఎక్కువగా దీవులు ఉన్న ప్రాంతాలను ఇష్టపడతారు, అలాంటి ప్రాంతం అంటే ముందు చెప్పేది మాల్దీవులు, ఇక్కడకు చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు, చుట్టూ సముద్రం చల్లటి వాతావరణం బోటు షికారు, లగ్జరీ హోటల్స్ మద్యం ఇలా అన్నీ సౌకర్యాలు ఉంటాయి. అందుకే టూరిస్టులకి బెస్ట్ స్పాట్ ఇది.
కాని ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా వాతావరణంలో పెను మార్పులు వస్తున్నాయి, దీని వల్ల సముద్ర మట్టం పెరిగి మాల్దీవులు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. ఇక్కడ 98 శాతం మంది చదువుకున్నవారే ఉన్నారు..ప్రపంచంలో అతి చిన్న ముస్లిం దేశం ఇదే.
అయితే 2100 కి సముద్రమట్టం పెరిగి చాలా వరకూ ఈ దీవులు మునిగిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు.. మాల్దీవుల్లో సుమారు 200 దీవులు నివాసానికి అనువుగా ఉన్నాయి. 80 దీవులు టూరిస్టు రిసార్టులుగా ఉన్నాయి, 2004 లో సునామి వచ్చిన సమయంలో 20 దీవులు సమూలంగా సముద్ర గర్భంలో కలిసిపోయాయి. తాజాగా ప్రజల కోసం కృత్రిమంగా కొన్ని దీవులు డవలప్ చేస్తోంది ప్రభుత్వం, అక్కడకు జనాలని వచ్చే రోజులలో తరలించనుంది.