ఎవరైనా కేకుని ఎంతో ఇష్టంగా తింటారు.. ఓరెండు పీస్ లు తినేది బాగా టేస్ట్ ఉంటే ఆ ఫ్లేవర్ నచ్చితే నాలుగు పీసులు తింటాం, కేకు అంటే పిల్లలకు పెద్దలకు అందరికి ఇష్టమే.. ఏ వేడుక అయినా కేక్ కట్ చేయించాల్సిందే, అయితే ఇక్కడ ఓ వ్యక్తికి మాత్రం కేక్ తింటే అతని శరీరంలో ఓ వింత జరుగుతోంది.
అతను కేక్ తింటే చాలు అతడి కడుపులోకి వెళ్లి మద్యంలా మారిపోతుంది. ఇంగ్లాండ్కు చెందిన ఆ వ్యక్తి పేరు కార్సన్. అతని ఏజ్ 62 సంవత్సరాలు, లోలోఫ్ట్లోని సఫోల్క్లో నివసిస్తున్నాడు. ఆటో బ్రూవరీ సిండ్రోమ్ సమస్య ఇతన్ని వేధిస్తోంది, కేక్ తింటే అది మద్యంగా మారుతోంది శరీరంలో. దీనికి కారణం ఉంది.
ఓ రసాయన కర్మాగారంలో గతంలో పని చేశాడు. 2003 సంవత్సరంలో పనిలో ఉన్నప్పుడు బలమైన ఫ్లోరింగ్ ద్రావకం వాసన పీల్చాడు. దీంతో అతని శరీరంలో ఇలాంటి మార్పు వచ్చింది, అయితే దీనికి మందులేదంట.. పాపం చాలా సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు, తనబాధని ప్రభుత్వానికి చెప్పుకున్నాడు, అతనికి ఓ సర్టిఫికెట్ ఇవ్వనున్నారట.