మన దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి.. అయితే అక్కడ చరిత్ర ఆలయ విశిష్టత బట్టీ అక్కడ దేవుడికి వివిధ రకాల పూజలు చేస్తారు… అలాగే అభిషేకాలు జరుగుతాయి.. అంతేకాదు కొన్ని ఆలయాల్లో మొక్కులు కూడా ఆశ్చర్యంగా ఉంటాయి, మరికొన్ని చోట్ల పెట్టే ప్రసాదాలు అలాగే నైవేధ్యాలు కూడా ఎక్కడా చూడనివి ఉంటాయి, భక్తుల విశ్వాసంగా అనాదిగా వస్తున్న ఆచారంగా దీనిని పాటిస్తూ ఉంటారు.
మనం గుడికి వెళితే దేవుడికి నైవేధ్యంగా పండ్లు లేదా లడ్డూ ఇలా స్వీట్లు ఇస్తూ ఉంటాం, కాని ఇక్కడ దేవుడికి నైవేధ్యంగా ఏమి ఇస్తారో తెలుసా…దేవుడికి నైవేద్యంగా పీతలను సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. మరి ఇది ఎక్కడ అనేది చూస్తే..గుజరాత్, సూరత్ లో ఉన్న శివాలయంలో భక్తులు స్వామివారికి బ్రతికున్న పీతలను నైవేద్యంగా ఇస్తారు.
సూరత్ లో ఉన్న శివ భక్తులు స్వామి వారికి బతికి ఉన్న పీతలను నైవేద్యంగా ఇస్తారు… ఉమ్రాలో రామ్నాథ్ శివ ఘేలా దేవాలయంలో ఇలా జరుగుతుంది. ఇక ఇలా ఎందుకుచేస్తారు అంటే పిల్లలకు పెద్దలకు ఏదైనా చెవి సమస్య ఉంటే తగ్గిపోతుంది అని వారి నమ్మకం.. అందరూ వీటిని నైవేద్యంగా సమర్పిస్తారు.
|
|
|
ఇక్కడ ఆలయంలో స్వామికి నైవేద్యంగా ఏమి సమర్పిస్తారో తెలుసా
-