దారుణం కాబూల్ లో తమ పిల్లలకు తిండి పెట్టేందుకు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలుసా

Do you know what parents are doing to feed their children in Kabul

0
108

ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమయ్యాక అక్కడ దారుణమైన పరిస్దితులు కనిపిస్తున్నాయి. అప్పటి వరకూ లగ్జరీగా బతికిన వారు అందరూ కూడా ఒక్కసారిగా తమ జీవితం తలకిందులు అయింది అని అంటున్నారు . చేతిలో చిల్లిగవ్వ లేదు ఉన్నా ఆస్తులు ఎంత వస్తే అంతకు అమ్ముతున్నారు. ఇక చివరకు ఉన్న దానితోనే జీవితం గడుపుతున్నారు. ఇక్కడ ఎంత దారుణంగా పరిస్దితి ఉంది అంటే తినడానికి కూడా వేలల్లో ఖర్చు చేస్తున్నారు. కొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం విడిచి పారిపోయారు మరికొందరు విధిలేక అక్కడే ఉంటూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

తాలిబన్ల ఆక్రమణ తర్వాత రాజధాని కాబూల్లో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. కన్నబిడ్డలకు కడుపారా భోజనం పెట్టలేక విలవిల్లాడుతున్నారు. దీంతో చాలా మంది తమ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ని చాలా తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు.

సోఫా, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, బీరువా.. ఇలా అమ్మకానికి చాలా వస్తువులు తీసుకువస్తున్నారు. కొందరు వ్యాపారులు అతి చవకగా వీటిని కొంటున్నారు. కాబూల్ వీధులు రద్దీగా మారాయి. రూ. 25 వేలు పెట్టి కొనుగోలు చేసిన ఫ్రిడ్జ్ ఇప్పుడు రూ. 5 వేలకు అమ్మాను అని చెబుతున్నాడు ఓ తండ్రి..