రైలులో మనం ప్రయాణం చేసే సమయంలో ఒక్కోసారి కొందరు సిగరెట్ కాల్చడం చూస్తూ ఉంటాం.. అయితే వారు ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా బాత్రూమ్ లో కాలుస్తూ ఉంటారు… చుట్ట సిగరెట్ బీడీ ఇలాంటివి చాలా మంది కాలుస్తూ పట్టుబడిన ఘటనలు చాలా ఉన్నాయి… ఇక ప్రయాణికులకి ఇది చాలా అసౌకర్యం, అయితే ఇప్పుడు చాలా వరకూ ఇది తగ్గింది. ఇక రిజర్వేషన్ బోగిలో ఇలాంటివి చేస్తే తోటి ప్రయాణికులు కూడా వెంటనే టీసీకి చెబుతున్నారు.
దీంతో ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉంటోంది. అయితే దీని వల్ల రైలు ప్రయాణికులకి అసౌకర్యంతో పాటు ప్రమాదాలు జరగవచ్చు.., దాని వల్ల బోగీలో మంటలు రావచ్చు…రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్లో ఒక్క సిగరెట్ ను కలిగివుండి పట్టుబడినా, రైల్వే చట్టం 164 ప్రకారం కేసు నమోదు చేయాలని నిర్ణయించింది.. గతంలో ఎవరైనా సిగరెట్ కాలుస్తూ దొరికితే వారికి జరిమానా విధించేవారు.
ఇక ఇలాంటిది కుదరదు రైల్లో సిగరెట్ తో పట్టుబడితే, మూడు సంవత్సరాల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు. ఇక ఎవరైనా సరే రైలులో ఇలా సిగరెట్ పట్టికెళ్లినా అది కేసు అవుతుంది.. కాల్చినా దానిని రైలులో రవాణా చేసినా కేసు…..ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళుతున్న రైలు టాయిలెట్ లో ఓ ప్రయాణికుడు వేసిన సిగరెట్ వల్ల మంటలు వచ్చిన సంగతి తెలిసిందే.
ReplyForward
|