చాలా మంది గుడికి వెళ్లిన సమయంలో పెద్ద పెద్ద పుణ్య క్షేత్రాలలో మొక్కులు చెల్లించుకుంటారు, ఈ సమయంలో తలనీలాలు కూడా మొక్కు ఇవ్వడం జరుగుతుంది, ఇలా ఏటా లక్షలాది మంది తిరుమల వెంకన్నకు మొక్కు చెల్లించుకుంటారు, స్వామికి కొండపై కల్యాణకట్ట దగ్గర తలనీలాలు సమర్పిస్తారు.
ఇలా తలనీలాలు ఇస్తామని మొక్కుకుంటే ఆ కోరిక తీరుతుందని ఓ నమ్మకం.
మరి ఇలా తలనీలాలు ద్వారా వచ్చిన వెంట్రుకలని టీటీడీ ఏమి చేస్తుందో తెలుసా… వీటిని గ్రేడ్ గా విభజించి వేలం పాట వేస్తారు. దాదాపు ఏటా 6000 కిలోల తలనీలాలు వస్తాయి అని గత లెక్కలు చెబుతున్నాయి.మరి ఎలా వాటిని గ్రేడ్ చేస్తారు అనేది చూస్తే.
గ్రేడ్-1….. 31 ఇంచుల కంటే ఎక్కువ పొడవుంటే వాటిని గ్రేడ్ 1 అంటారు
గ్రేడ్-2…..16-30 ఇంచుల మధ్య పొడవుండే వెంట్రుకలు గ్రేడ్ 2 లెక్కిస్తారు
గ్రేడ్-3… 10-15 ఇంచులు పొడవుండే వెంట్రుకలు గ్రేడ్ 3 అంటారు
ఇక్కడ తలనీలాలు ఇచ్చేవారికి తెల్లవెంట్రుకలు ఉంటాయి, వాటిని సపరేట్ గ్రేడింగ్ ఉంటుంది..
ఇక మొక్కుల రూపంలో వచ్చిన వీటిని ప్రతీ రోజూ సేకరించి వాటిని గ్రేడ్ చేసే సమయంలో ముందు వేడినీటిలో వేస్తారు, అందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది, అలా బాయిల్ చేసి ఆ జుట్టుని శుభ్రం చేస్తారు.. గోడౌన్లలో ఉష్టోగ్రతల మధ్య ఆరబెడతారు. ఇక ప్రాసెస్ పూర్తి అయ్యాక వీటిని వేలం వేస్తారు, విగ్ పరిశ్రమలు బాగా కొంటాయి విదేశాల్లో వీటిని.