టీఆర్ఎస్లో మేయర్ పీఠం కోసం ఆశావహుల సంఖ్య ఎంత ఉందో తెలిసిందే… ఇక రేపు ఉదయం మేయర్ ఎవరు డిప్యూటీ మేయర్ ఎవరు అనేది తేలిపోనుంది.ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు సీఎం కేసీఆర్, కేటీఆర్ను కలిశారు, అయితే కేసీఆర్ మాత్రం ఇంకా ఎవరికి హామీ ఇవ్వలేదు.
సీఎం కేసీఆర్ పంపించిన సిల్డ్ కవర్లలో వారి పేర్లు ఉంటాయి అని తెలుస్తోంది..మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది.
అందుకోసం చాలా మంది పోటీ పడుతున్నారు. ఓసీలతో పాటు బీసీ మహిళలు కూడా పోటీ పడుతున్నారు. ఇక ఎవరు ఎవరు ఈ లిస్టులో ఉన్నారు అనేది చూస్తే.
ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవికి
భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి
తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత
పీజేఆర్ కూతురు విజయారెడ్డి
వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ మన్నె కవిత
అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి వీరి పేర్లు వినిపిస్తున్నాయి.