కందగడ్డలు మహాశివరాత్రికి బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి…సాధారణ సమయాల్లో కంటే ఈ రోజు మరీ ఎక్కువగా అమ్ముతూ ఉంటారు… అయితే అసలు శివరాత్రికి కందగడ్డలకు ఏంటి సంబంధం అంటే… దీనికి ఓ కారణం ఉంది..
ఈ దుంపలను తెలంగాణలో కందగడ్డ అని ఆంధ్రాలో చిలగడ దుంప అని పిలుస్తారు. ఇక శివరాత్రికి జాగారం చేసేవారు కచ్చితంగా దీనిని తమ డైట్ లో చేర్చుకుంటారు.అయితే పూర్వం రోజుల్లో అడవిలో ఉండే వారు శివరాత్రి రోజున ఆ శివుడికి ఈ దుంపలు నైవేద్యంగా పెట్టేవారు.. ఆ దుంపలు మహాదేవుడికి బాగా ఇష్టమైన పుడ్గా ఆటవికులు భావించేవారు. అందుకే అనాదిగా ఇది ఆచారంగా పాటిస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది గుడిలో ఇంట్లో ఇవే నైవేద్యంగా పెడతారు.కందగడ్డ పంట వేసినప్పడు సరిగ్గా అవి శివరాత్రికి కొంచెం అటు ఇటుగా చేతికొస్తాయి. ఇది కూడా ప్రధానంగా పెద్దలు మనకు చెప్పేమాట, ఇలా మార్కెట్లో ఎక్కువగా అమ్మకాలు జరుగుతాయి. ఇవి తినడం వల్ల నీరసం రాకుండా ఉంటుంది అందుకే జాగరణ చేసేవారు వీటిని తింటారు.
|
|
శివరాత్రి రోజు కందగడ్డలు ఎక్కువగా కొంటారు ఎందుకో తెలుసా
-