మనం మోడ్రన్ టాయిలెట్స్ ఇప్పుడు వాడుతున్నాం, అయితే ఇక్కడ మీరు ఓ విషయాన్ని గమనించారా.. మనం చాలా చోట్ల చూసే ఉంటాం, కొన్నింటికి రెండు ఫ్లష్ బటన్లు ఉంటాయి, అయితే వాడతాం కాని ఇలా ఎందుకు ఉంటాయా అని ఎప్పుడూ గమనించం.. ఆ ప్లష్ ఒకటి చిన్నదిగా ఉంటే.. మరో బటన్ పెద్దదిగా ఉంటుంది. ఇలా ఉండటానికి ప్రధాన కారణం ఓ పొదుపు మంత్రం, అవును నీరు వృదా కాకుండా ఇలా వాడతారు.
మీరు చూడండి డబుల్ ఫ్లష్లో ఉండే పెద్ద బటన్ నొక్కితే ఆరు నుంచి తొమ్మిది లీటర్ల వరకు నీళ్లు టాయిలెట్లోకి వెళ్తాయి.
పక్కన ఉన్న చిన్న బటన్ నొక్కితే మూడు లేదా నాలుగు లీటర్ల నీరు వస్తాయి….సో మూత్రం పోసుకుంటే మీరు చిన్న బటన్ ప్రస్ చేయాలి, అదే మల విసర్జన చేస్తే కచ్చితంగా పెద్ద బటన్ ప్లష్ చేయాలి అది దీని వెనుక ఉన్న పాయింట్.
ఇలా డబుల్ ఫ్లష్ ట్యాంక్లను వాడటం వల్ల ఏటా 17 వేల లీటర్ల నీరు ఆదా అవుతుందని అంచనా…. సో ఈసారి మీకు ఈ డిఫరెన్స్ తెలిసింది కాబట్టీ మీ సన్నిహితులకి చెప్పండి… నీరు వృదా కానివ్వకండి అంటున్నారు నిపుణులు.
దీనిని తొలిసారి 1980లో ఆస్ట్రేలియాలో అమలు చేశారు.
ReplyForward
|