నువ్వు కంచి వెళ్లి వచ్చావా బంగారు వెండి బల్లిని ముట్టుకున్నావా అయితే నేను నిన్ను ముట్టుకుంటా.. ఎందుకురా.. నా నెత్తి మీద బల్లి పడింది.. ఆ దోషం పోవాలి అంటే నిన్ను ముట్టుకుంటే పోతుంది… ఇది చాలా మంది చెప్పే మాట, అయితే దీని వెనుక ఉన్న ఓ వాస్తవం తెలుసుకోవాలి.
ఇలా బల్లి నిజంగా పడితే ముందు ఇలా ఎవరైనా కంచి వెళ్లారా వారిని ముట్టుకుందాం అనే ఆలోచన కంటే ముందు తలకి స్నానం చేయాలి.. బల్లి మన తలపై పడితే దానికి ఉండే విషం లాంటిది దాని శరీరం పై ఉండే క్రిములు లాంటివి మనకు అంటుకుంటాయి. అందుకే అది తొలగాలి అని తలకి స్నానం చేయమంటారు.
ఇలా చేస్తే ఎలాంటి దోషం ఉండదు… రోగాలు రావు.. అంతేకాని బంగారం వెండి బల్లి ఎవరు ముట్టుకున్నారు వారిని ముట్టుకుంటే తగ్గుతుంది దోషం పోతుంది అని నమ్మక్కర్లేదు అంటున్నారు వైద్యులు, ఎవరి మీద బల్లి శరీరంపై పడినా కచ్చితంగా స్నానం చేయాలి అంటున్నారు వైద్యులు.