పాముని చూడగానే ఆమడ దూరం పారిపోతాం.. అయితే పాములకి నిజంగా చెవులు ఉంటాయా అవి పాలు తాగుతాయా అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. పాములకి చెవులు అనేది బాహ్య అవయవంగా ఉండవు లోపలి చెవి భాగాల రూపాలుంటాయి.. కానీ అవి పని చేయవు. మరి పాములు ఎలా వాటి శత్రువులని దగ్గరకు వచ్చేవారిని గుర్తిస్తాయి అంటే.
పాములు వాటి పొట్ట చర్మం ద్వారానే శబ్దాలను గ్రహిస్తాయి. అందుకే నేలపై ఎవరైనా అడుగు వేసినా ఆ తరంగాల వల్ల వెంటనే వాటికి తెలిసి వెనక్కి తిరుగుతుంది…ఇలా తెలుసుకుంటాయి… ఇక పాలు తాగుతాయా అంటే అస్సలు తాగవు,పాము నోటి నిర్మాణం ద్రవాలను పీల్చుకునేందుకు వీలుగా ఉండదు. మీరు ఎక్కడైనా చూడండి దీనికి దారం ద్వారా పాలు పడతారు.
సో పాలు పోయడం అది తాగడం అనేది నమ్మదగినది కాదు… ఇక పాములు పగబడతాయా అంటే అస్సలు కాదు..
మీరు అంత ఆలోచించకండి, దానికి తెలివి తేటలు, జ్ఞాపకశక్తి లేవు. ఇవన్నీ సైంటిస్టులు చెప్పినవే, కాని మనం ఏనాటి నుంచో పాములు పగబడతాయి అని అనుకుంటాం, పగ పట్టే అంత తెలివి పాముకి లేదు అంటున్నారు సైంటిస్ట్ లు.