2020 మార్చి నుంచి కరోనా ఎఫెక్ట్ తో అన్నీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఉద్యోగులకి సౌలభ్యం కల్పించాయి.. అయితే ఇలా దాదాపు 11 నెలల నుంచి అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, కంపెనీలకు మంచి అవుట్ పుట్ వస్తోంది, ఆఫీసులకి వచ్చి చేసే పని కంటే ఇంటి నుంచి చేసే పని వల్ల వారికి మంచి అవుట్ పుట్ వచ్చింది.
అయితే కొన్ని కంపెనీలు ఖర్చులు తగ్గించుకుని మంచి లాభాలు ఆర్జించాయి, అయితే తాజాగా ఓ వార్త వినిపిస్తోంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారికి కొన్ని సమస్యలు వస్తున్నాయట, ఇలా ఉద్యోగులు వీటిపై అశ్రద్ద చేయద్దు అంటున్నారు.
ఇటీవల నిర్వహించిన సర్వేలలో కూడా అనేక విషయాలు బయటపడుతున్నాయి, ఇంటి దగ్గర నుంచి పని చేస్తున్న వారిలో 90 శాతం మందికి శారీరక మానసిక ఒత్తిడి పెరిగిపోయింది, ఊబకాయం సమస్య వచ్చింది.39.40శాతం మందికి మెడ నొప్పి, 53.13శాతం మందికి నడుము నొప్పి, 44.28శాతం మందికి నిద్ర పట్టకపోవడం, 25 శాతం మందికి చేతులు కాళ్లు నొప్పులు వస్తున్నాయట, అయితే సరైన నిద్ర అలాగే మంచి ఆహారంతో పాటు ఒకేసారి ఎక్కువ సేపు కూర్చుని ఉండవద్దు అంటున్నారు నిపుణులు. నిత్యం గంట వ్యాయామం చేయాలి అని చెబుతున్నారు.