దోమకాటు వల్ల కరోనా వస్తూందా… క్లారిటీ ఇచ్చిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ

దోమకాటు వల్ల కరోనా వస్తూందా... క్లారిటీ ఇచ్చిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ

0
114

ప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే… ఈ వైరస్ ఒకరినుంచి మరోకరికి వ్యాపిస్తుంది…. అందుకే ఎవరితో అయినా మాట్లాడాలి అంటే కనీసం రెండు మూడు మీటర్ల దూరంలో నుంచి మాట్లాడాలని అంటున్నారు… అయితే ఈ వైరస్ పై అనేక రూమర్లు వచ్చాయి…

ఈ మధ్య కాలంలో చికెన్ తినడంవల్ల కరోనా వైరస్ వస్తుందని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి… దీంతో చాలామంది చికెన్ తినడం మానేశారు… దీనిపై ఖండించిన ప్రభుత్వం చికెన్ తినడంవల్ల కరోనా వైరస్ రాదని తెలిపింది… ఆ తర్వాత గాలీ ద్వారా పేపర్ల ద్వారా కరోనా వైరస్ మరోకరికి సోకుతుందని ప్రచారం సాగింది…

ఇందులో కూడా వాస్తవం లేదని తెలిపింది.. ఇప్పుడు దోమకాటు వల్ల కూడా కరోనా వైరస్ వస్తుందని ప్రచారం సాగుతోంది… దీనిపై కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది… దోమకాటు వల్ల వైరస్ రాదని దోమకాటు వల్ల వైరస్ వ్యాపించదని చెప్పింది… ఈ విషయంలో ఎవ్వరు ఆందోళన చెందవద్దని చెప్పింది…