డొనాల్డ్ ట్రంప్ కు భార్య భారీ షాక్ ఇవ్వనుందా ?

డొనాల్డ్ ట్రంప్ కు భార్య భారీ షాక్ ఇవ్వనుందా ?

0
114

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తాను అని ధీమాగా చెప్పిన ట్రంప్, తాజాగా ఓటమి పాలయ్యారు, బైడెన్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు, అయితే ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం చేశారు, కాని పరిస్దితులు ట్రంప్ కు వ్యతిరేకం అయ్యాయి, చివరకు ఆయన ఓటమి చెందారు.

డొనాల్డ్ ట్రంప్కు కొద్ది రోజుల్లోనే మరో చేదు అనుభవం ఎదురయ్యే అవకాశం ఉంది అంటున్నారు. తన భార్య మెలానియా.. డొనాల్డ్ ట్రంప్కు విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఎప్పుడైతే ట్రంప్ వైట్ హౌస్ ఖాళీ చేస్తారో ఆ సమయంలో విడాకులు ఇవ్వాలి అని మెలానియా నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

15 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు మెలానియా రెడీ అయ్యారు అని వార్తలు వస్తున్నాయి, అయితే గతంలోనే ఆమె ట్రంప్ కు విడాకులు ఇవ్వాలి అని చూశారట, అయితే అప్పుడు ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నారు, ఈ సమయంలో విడాకులు ఇస్తే అవమానం జరిగినట్టే అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ కోసం ఆమె ఎన్నికల ప్రచారం కూడా చేసిన విషయం తెలిసిందే.