డోంట్ వర్రీ వడ్డీతో సహా వసూళ్లు చేస్తాం… చంద్రబాబు…

డోంట్ వర్రీ వడ్డీతో సహా వసూళ్లు చేస్తాం... చంద్రబాబు...

0
114

ఇటీవలే కాలంలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వరుస షాక్ లు తగులుతున్న సంగతి తెలిసిందే… ఆ పార్టీకి చెందిన కీలక నేతల వైసీపీలోకి వరుసగా క్యూ కడుతున్న సంగతి తెలిసిందే… ఈక్రమంలోనే నిన్న మాజీ మంత్రి సిద్దారాఘవరావు వైసీపీ తీర్ధం తీసుకున్నారు… దీనిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు…

ఎవరు వెళ్లిపోయినా టీడీపీకి ఏమీ కాదని అన్నారు… దశాబ్దాలుగా టీడీపీలో ఉంటూ పదవులు అనుభవించిన వారు ఇప్పుడు పార్టీ వీడుతున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు… అధికార పార్టీ వేధింపులకు భయపడే వారు పార్టీమారుతున్నారని అన్నారు…

ఇప్పటి వరకు పార్టీ మారిన వారు కనుముగైయ్యారని అన్నారు… వారు పార్టీ మారినంత మాత్రాన ఏం నష్టం లేదని రాబోయే రోజుల్లో 40 ఏళ్లకు సరిపడ నాయకత్వాన్ని తయారు చేస్తామని అన్నారు… తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా వసూలు చేస్తామని అన్నారు…