తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్..ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

0
73

హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ కు ప్రధాని మోడీ చేరుకున్నారు. ఈ సమయంలో కార్యకర్తలు భారత్ మాతాకీ జై, నరేంద్ర మోడీకి జై అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా మోడీ ప్రజలకు నమస్కారం చేశారు. బీజేపీ విజయ సంకల్ప సభలో మోడీ మాట్లాడుతూ..తెలంగాణ మొత్తం పరేడ్ గ్రౌండ్స్ కు వచ్చినట్టుంది. మోడీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించడం విశేషం. కరోనా సమయంలో తెలంగాణాలో కరోనా వాక్సిన్లు పంపిణి చేశాం. ప్రజలకు బీజేపీపై అపారమైన నమ్మకం ఉంది.

డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజలకు మేలు చేస్తుంది. GHMC ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలను బీజేపీ చూసింది. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎందరో మహిళలు వచ్చారు. తెలంగాణ స్నేహమంతా ఇక్కడ కనిపిస్తుంది. 2019 సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ పుంజుకుంటూ ఉందని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బిజెపి పార్టీ ముందుకు వెళుతూ ఉందని చెప్పారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు.