బ్రేకింగ్ – వరకట్నం ఇక బంద్ కేరళ సర్కార్ కీలక నిర్ణయం

Dowry is no longer a key decision of the Kerala government

0
91

కట్నం తీసుకోవడం నేరం అని చాలా మందికి తెలుసు. కాని ఇంకా చాలా మంది కట్నం తీసుకుంటున్నారు. అంతేకాదు కుటుంబాలు సంబంధం మాట్లాడుకుని అబ్బాయి అమ్మాయికి నచ్చిన తర్వాత కూడా, కట్న కానుకలు సెట్ కాక సంబంధాలు వదులుకున్న వారు ఉన్నారు. ఇక కట్నం ఎంత ఇచ్చినా ఆశ తీరక మరింత ఆ వధువుని కన్నీరు పెట్టించిన వారు ఉన్నారు. నిత్యం ఇలాంటి కేసులు నమోదు అవుతున్నాయి.

అయితే కేరళ ప్రభుత్వం వరకట్నానికి వ్యతిరేకంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ ప్రభుత్వంలో పని చేస్తున్న పెళ్లికాని పురుష ఉద్యోగులు తాము వరకట్నాన్ని ప్రొత్సహించడం లేదా తీసుకోవడం చేయవద్దని స్పష్టం చేసింది. పెళ్లయిన నెల రోజుల్లో తాము పని చేస్తున్న విభాగం అధిపతులకు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది.

అయితే ఇందులో అతని భార్య ,అతని అత్త మామల సంతకాలు, వరుడి తండ్రి సంతకం ఉండాలి. వివిధ శాఖలకు సంబంధించిన అధిపతులు ప్రతి ఏడాది ఏప్రిల్ 10, అక్టోబర్ 10కి ముందు ఇందుకు సంబంధించిన డిక్లరేషన్లను జిల్లా వరకట్న నిరోధక అధికారికి సమర్పించాలని సూచించింది. అంతేకాదు ప్రతీ ఏడాది నవంబర్ 26 వరకట్న వ్యతిరేక దినోత్సవంగా పాటిస్తారు. ఆరోజు విద్యాలయాల్లో కట్నం తీసుకోము అని విద్యార్థులు ప్రతిజ్ఞ చేయాలని ప్రభుత్వం సూచించింది.