ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అతను రెండేళ్ల పాటు ఆయన కేబినెట్ హోదాలో కొనసాగనున్నారు. గత మంగళవారం ముఖ్యమంత్రి జగన్ తో డాక్టర్ నోరి భేటీ అయ్యారు.
క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై సీఎంతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయంలో తగిన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వ సలహాదారుడిగా ఉండాలని నోరిని జగన్ కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.
రేడియేషన్ ఆంకాలజీలో దేశంలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకు 43 ఏళ్ల అనుభవం ఉంది. వైద్యరంగంలో ఆయన చేసిన కృషికి 2015లో పద్మశ్రీ అవార్డు పొందారు. ఆయన సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వం సలహాదారుగా నియమించింది.