చైనాలో ఇకపై ఆ పాటలు పాడకూడదు – డ్రాగన్ కంట్రీ కొత్త రూల్

Dragon Country New Rule

0
83

చైనా దేశంలో తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి అందరిని షాక్ కి గురిచేస్తాయి. ఆ దేశం తీసుకునే నిర్ణయాలు మరెక్కడా ఎవరూ తీసుకోరు. దానిని ప్రజలు పాటించాల్సిందే. కాదని ఎవరైనా హద్దు మీరితే కఠిన చర్యలు తీసుకుంటారు. తాజాగా చైనా ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. చైనా దేశంలో కారియోకి పాటలను నిషేధించింది. ఈ పాటలకు చైనాలో చాలా ఫాలోయింగ్ ఉంటుంది.

వేలాది బార్లు రెస్టారెంట్లు ఔట్ లెట్లలో ఈ సాంగ్స్ పాడతారు. దాదాపు 50 వేలకు పైగానే ఈ అవుట్ లెట్లు ఉన్నాయి. అయితే సడెన్ గా చైనా సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే డ్రాగన్ కంట్రీ దీనికి కారణం కూడా చెప్పింది.

చైనా జాతీయ ఐక్యత, సార్వభౌమత్వానికి హాని కలిగించేలా ఈ పాటలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. డ్రగ్స్ మాదకద్రవ్యాలు ప్రొత్సహించేలా ఉన్నాయి అని తెలిపింది. ఇకపై ఇవి వినిపించకూడదు దేశంలో అక్టోబర్ 1 నుంచి పాటలపై నిషేదం అమలు అవుతుంది.