హైదరాబాద్ లో నిలిచిపోనున్న తాగునీటి సరఫరా ఎప్పుడో తెలుసుకోండి

హైదరాబాద్ లో నిలిచిపోనున్న తాగునీటి సరఫరా ఎప్పుడో తెలుసుకోండి

0
76

ఇప్పటికే హైదరాబాద్ లో వాటర్ కష్టాలు కొన్ని ఏరియాల్లో ఉన్నాయి.. అయితే రెండు రోజులకి ఓసారి నల్లా నీరు వస్తుంది, తాజాగా మళ్లీ నీటి కష్టాలు ఓరోజు అనే వార్త వైరల్ అవుతోంది.

హైదరాబాద్ నగర మంచినీటి అవసరాలు తీర్చుతున్న మూడో దశ కృష్ణా పైపులైనుకు భారీగా లీకేజీలు ఏర్పడినట్టు అధికారులు గుర్తించారు. దాంతో ఈ నెల 29 నుంచి హైదరాబాదులోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. లీకేజీలు ఏర్పడిన ప్రాంతాలకు తరలివెళ్లిన అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు.

ఈ నెల 29 ఉదయం 6 గంటల నుంచి 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు తాగునీటి సరఫరా నిలిపివేయాలని జలమండలి అధికారులు నిర్ణయించారు. సో చూశారుగా అంటే 29న పైప్ ద్వారా నీరు రావాలసిన వారికి నీరు రాదు నిలిపివేస్తారు, దీని ప్రకారం వాటర్ వాడుకోండి పొదుపుగా.