మనం ఎంచక్కా బైక్ వేసుకుని రోడ్డుపైకి వెళతాం, కాని పోలీసులు నిత్యం ఎక్కడో ఓచోట ఆపుతూనే ఉంటారు, ఆ భయం మనకు ఉంటుంది..వాహనం నడిపేటప్పుడు సరైన డాక్యుమెంట్లు లేకుండా నడిపితే పోలీసులు చలానాలు రాసి జరిమానా విధిస్తుంటారు. అయితే లైసెన్స్ లేకుండా బండి నడిపితే వేల రూపాయలు ఫైన్లు పడుతున్నాయి, అందుకే తాజాగా ప్రభుత్వం సరికొత్త విధానం అమలులోకి తీసుకువచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్ పొందడాన్ని చాలా సులభతరం చేసింది. ఇక మీరు ఇంట్లోనే ఉండి ఆన్ లైన్ లో డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. దీని కోసం మీరు ఏం చేయాలో చూద్దాం.
ముందుగా ఆర్టీఏ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి
అక్కడ మీ వివరాలతో డ్రైవింగ్ లైసెన్స్ కొత్తదాని కోసం ఫామ్ పూర్తి చేయాలి
మీకు అక్కడ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి
లెర్నింగ్ లైసెన్స్ పర్మినెంట్ లైసెన్స్ కనిపిస్తుంది దీనిలో మీరు ఏది కావాలో అది పూర్తి చేయాలి
అక్కడ మీ పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత మీరు సంతకం ఫోటోని స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి
అలాగే మీరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం కావాలసిన డాక్యుమెంట్లు కూడా స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి
ఇక మీరు ఏ వాహనానికి లైసెన్స్ అప్లై చేస్తున్నారో టిక్ చేయాలి
టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ అనేది మార్క్ చేయండి తర్వాత ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి
ఇక దగ్గర్లో ఉన్న ఆర్టీఏ కార్యాలయం సెలక్ట్ చేసి అక్కడ పేరు ఒకే చేయండి
తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ఎప్పుడు మీకు కుదురుతుందో ఆ డేట్ అక్కడ నమోదు చేయండి
ఇలా ఇచ్చిన డేట్ రోజున మీరు ఆఫీసుకి వెళితే మీకు టెస్ట్ కండెక్ట్ చేస్తారు 350 చలానా చెల్లించాల్సి ఉంటుంది
అలాగే అక్కడ కంప్యూటర్ టెస్ట్ కోసం మాక్ పేపర్లు ఉంటాయి వాటిని చూసి ఫిల్ చేస్తే మీకు మరింత సులువుగా ఉంటుంది
ఇలా చేస్తే 15 రోజుల్లో మీకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది.