డ్రైవింగ్ లైసెన్స్ లేదా అయితే మీకో శుభవార్త

డ్రైవింగ్ లైసెన్స్ లేదా అయితే మీకో శుభవార్త

0
83

మన దేశంలో ముఖ్యంగా బండి నడిపే చాలా మంది లైసెన్స్ అప్లై చేసుకోరు, ఈ సమయంలో పోలీసులకి దొరికితే ఇక అంతే చలాన్లు వేలకి వేలు కడతారు..ఇలా కొన్ని సమయాల్లో పోలీసులకి దొరక్కుండా చాలా మంది పారిపోతూ ప్రమాదాలకు గురి అవుతున్నారు, ఇప్పటి వరకూ లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటే మీకు లెర్నింగ్ లైసెన్స్ , అలాగే రెన్యువల్ లైసెన్స్ వచ్చేది. ఇప్పుడు రెండు కలిపి ఒకే విధంగా అప్లికేషన్ ఫామ్ ఇవ్వనున్నారు అధికారులు.

ఇక పై లైసెన్స్ లేకుండా ఎవరు బైక్ నడపకూడదు, అందరూ కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలి..
డిఫరెంట్ గా కొత్త కొత్త అప్లికేషన్లు విభాగాల వారిగా ఇవ్వకుండా అన్నింటికి కలిపి ఒకే ఫామ్ ఇవ్వాలి అని రవాణాశాఖ దీనికి ప్రణాళిక సిద్దం చేస్తోంది. ఇలా అప్లై చేసుకున్న 20 రోజులకి మీకు డ్రైవింగ్ లైసెన్స్ కార్డు రూపంలో వస్తుంది. ఇది కేంద్రం తీసుకువస్తున్న కొత్త రూల్.

మీరు హెల్త్ కి సంబంధించి ఆరోగ్య సర్టిఫికెట్ కూడా ఇవ్వాల్సిన అసవరం లేదు రెన్యువల్ సమయంలో… కేవలం మీరు సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పిస్తే సరిపోతుంది.. అలాగే లైసెన్స్ పొందటానికి కనీస అర్హత 8వ తరగతికి తగ్గించింది. ఒక్కసారి ఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత 30 సంవత్సరాలు వరకు చెల్లుబాటు అవ్వనుంది.