డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలో దొరికితే హైదరాబాద్ లో కొత్త పనిష్మెంట్

డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలో దొరికితే హైదరాబాద్ లో కొత్త పనిష్మెంట్

0
87

తాగి వాహనాలు నడుపుతున్నారు చాలా మంది ..దీని వల్ల వారికే కాదు ఎదుటి వారి ప్రాణాలకి కూడా ప్రమాదం ఏర్పడుతోంది, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇటీవల ఇలాంటి ప్రమాదాలు మరిన్ని ఎక్కువ అవుతున్నాయి, ముఖ్యంగా తాగి రాష్ డ్రైవింగ్ చేస్తున్న వారిని ఎప్పటి కప్పుడు గుర్తిస్తున్నారు.

అలాగే హైటెక్ సిటీ ప్రాంతాలు పబ్ లు ఉన్న ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు, తాజాగా
మాదాపూర్ లో జరిగిన డ్రంకెన్ డ్రైవింగ్ రోడ్డు ప్రమాధాలపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. రెండు ప్రమాదాలు మద్యం మత్తులో డ్రైవింగ్ చేయటం వల్లే జరిగాయని తాజాగా ఆయన వెల్లడించారు.

ఇక మీదట డ్రంకెన్ డ్రైవింగ్ లో దొరికితే..పదేళ్లు జైలు శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తామని అన్నారు.
ఇక తల్లిదండ్రులు కూడా వీరి విషయంలో జాగ్రత్తలు చెప్పాలి, మా వాడు అలాంటి వాడు కాదు అంటున్నారు, ఇక పై పేరెంట్స్ ని వదిలేది లేదు అని తెలిపారు ఆయన.

ఎవరైనా పబ్బులలో మద్యం తాగి సైబరాబాద్ లో డ్రంకెన్ డ్రైవింగ్ లో పట్టుబడితే…ఆ కేసులో పబ్బు నిర్వాహకులను చేరుస్తామని అన్నారు, పబ్ లో మద్యం తాగి బయటకు వచ్చేవారిని వారి ఇంటికి పబ్బులు చేర్చాలి అని తెలిపారు ఆయన, లేకపోతే వారి వాహానాలకి డ్రైవర్లని ఏర్పాటు చేసుకోవాలి అని తెలిపారు.