ఈ కండీషన్ కు బీజేపీ ఒకే అన్నందుకు పొత్తుపెట్టుకున్నా…. పవన్

ఈ కండీషన్ కు బీజేపీ ఒకే అన్నందుకు పొత్తుపెట్టుకున్నా.... పవన్

0
126

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా రాజధాని రైతులతో సమావేశం అయ్యారు… ఈ సమావేశంలో రైతులకు పవన్ పలు హామీలు ఇచ్చారు… రాజధాని ఎక్కడికి వెళ్లదని ఇక్కడే ఉంటుందని అన్నారు… వైసీపీని సర్కార్ కూల్చే వరకు తాను నిద్రపోనని పవన్ హెచ్చరించారు…

ఢిల్లీ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని తాను వెళ్తున్నానని చెప్పారు.. ఏం జరుగుతుందో ఇప్పుడు తాను చెప్పడం లేదని కానీ అద్బుతాలు జరగబోతున్నాయని అన్నారు… జగన్ కూల్చి వేతలతో పాలన మొదలు పెట్టి చివరకు కూలిపోకతప్పదని అన్నారు…

జగన్ మూడు రాజధానులు కాకుంటే 30 రాజధానులు పెట్టుకోమనండి కానీ వాటన్నింటిని తిరిగి ఒక్కటి చేస్తానని అన్నారు… అమరావతి రాజధానిగా ఉండాలనేకండీషన్ తో బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని అన్నారు పవన్….