ఈ కరోనా సమయంలో కొద్ది రోజులు మీ కార్యక్రమాలు వాయిదా వేసుకుంటే మంచిది ..మనిషి ఉంటే ఆ పని తర్వాత అయినా చేసుకోవచ్చు.. మనిషి లేకపోతే ఆ పని ఎప్పటికీ అవ్వదు అనేది గుర్తు ఉంచుకోండి, ఈ వారం మంచి ముహూర్తం ఉంది అని ఓ కార్యక్రమం పెట్టుకుంటాం.. ఇక ఆ ముహుర్తం రాదా వచ్చే రోజుల్లో బతికుంటే ప్రతీ నెలా అలాంటి ముహూర్తాలు వారానికి ఒకటి వస్తుంది.. అప్పుడు ఆ కార్యక్రమం చేసుకోవచ్చు..దయ చేసి కొన్ని పనులు వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమం.
పెళ్లి ఇప్పుడు కాకపోతే మరో ముహుర్తం లో చేసుకోవచ్చు..
అమ్మాయి అబ్బాయి ఉంటే చాలు.. ఆర్భాటాలు వద్దు అసలు ఈ కరోనా సమయంలో పెళ్లి వద్దు
పిల్లలతో టూర్లు బయటకు రావడాలు అసలు చేయవద్దు
రజస్వల ఫంక్షన్లు దిన కర్మలు దినాలు ఇలాంటి వాటి వల్ల వేగంగా యూపీలో కేసులు వచ్చాయి
ఒక రజస్వల ఫంక్షన్ వల్ల ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా వచ్చింది.. అందులో 4 మరణించారు
దయచేసి కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకోండి… ఇంటి వారే అని అనుకుంటారు.. అందులో ఒకరికి వచ్చినా కుటుంబం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది.
దయచేసి అందరూ పాటించాలి అని కోరుకుంటూ
ఈ సమాజంపై ప్రేమతో మీ మంచి కోరే మనిషి