ఈ దేశంలో కరోనా రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకున్నారో తెలుసా

ఈ దేశంలో కరోనా రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకున్నారో తెలుసా

0
110

ఉత్తరకొరియా గురించి ఈ మధ్య చాలా మంది వార్తలు వింటూనే ఉంటున్నారు , ఆదేశ అధినేత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కూడా తెలిసిందే.. అయితే కరోనా ప్రపంచం అంతా విస్తరించింది, అమెరికాని యూరప్ దేశాలని అతలాకుతలం చేసింది, అయితే ఉత్తర కొరియాలో మాత్రం కరోనా లేదు అంటున్నారు అక్కడ వారు.

దేశ సరిహద్దులను మూసివేయడం లాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తమ దేశంలో వైరస్ వ్యాపించలేదని ఉత్తర కొరియా చెబుతోంది. కాని కొన్ని దేశాలు మాత్రం ఇది నిజం కాదు అని అంటున్నాయి. దక్షిణ కొరియా కూడా ఇదే చెబుతోంది.

అక్కడ వైరస్ ఉన్నా భారీ స్ధాయిలో వ్యాపించదు అని చెబుతున్నారు, ఇక్కడ దేశంలో అధికారులు చెప్పేదాని ప్రకారం మేము ముందు నుంచి జాగ్రత్తలు తీసుకున్నాం మా దేశానికి ఎవరు వచ్చినా పరీక్షలు చేశాం… ఇంత అనుమానం వచ్చినా వెనక్కి పంపించాం అని తెలిపారు… భూ, వైమానిక, సముద్ర మార్గాలను మూసివేశాం అని చెబుతున్నారు. .