ఈ ఎన్నికల్లో గెలిచిన ఓడిన నటులు వీరే

ఈ ఎన్నికల్లో గెలిచిన ఓడిన నటులు వీరే

0
97

నిన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి, మొత్తానికి చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఈసారి ఎన్నికల్లో నిలబడి తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందా అని చూసుకున్నారు, అయితే తమిళనాడులో చాలా మంది సినీ ప్రముఖులు ఓటమి పాలయ్యారు, మరి ఈ ఎన్నికల్లో గెలిచిన సెలబ్రెటీలు ఓడిన వారు ఎవరు అనేది చూద్దాం .

 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో

డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ గెలుపొందారు

ఇక ఆయన కుమారుడు హీరో ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నుంచి గెలుపొందారు

థౌజండ్ లైట్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా నటి ఖుష్బూ పోటీ చేశారు కాని ఓటమిపాలయ్యారు

మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, ప్రముఖ హీరో కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు

డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత ఓటమిపాలయ్యారు

సినీ నటుడు, దర్శకుడు సీమాన్ తిరువొత్తియూరు ఓటమి పాలయ్యారు.

 

దాదాపు పది సంవత్సరాల తర్వాత డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది.. స్టాలిన్ సీఎం అవ్వనున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు డీఎంకేకు మద్దతు పలికారు.