ఏపీలో వాతావరణం చాలా వేడిగా ఉంటోంది.. ఎండలు మండుతున్నాయి.. వర్షాలు ఎప్పుడు వస్తాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు, వేడి గాలులు దారుణంగా ఉంటున్నాయి. తాజాగా ఏపీలో పలు జిల్లాల్లో పిడుగు హెచ్చరికలు ఇచ్చారు అధికారులు.
రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం అధికంగా ఉందని రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు. రైతులు పంట పొలాల్లో పనిచేసే వారు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి అని చెప్పారు. కూలీలు, పశువులు గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని తెలిపారు.
పిడుగులు పడేందుకు అవకాశమున్న ప్రాంతాలు
శ్రీకాకుళం జిల్లా:
సీతంపేట, కొత్తూరు, పాలకొండ, బుర్జ, రేగిడి ఆమదాలవలస, సరుబుజ్జిలి, లక్ష్మీనర్సుపేట, హీరామండలం, వంగర, వీరఘట్టం.
విజయనగరం జిల్లా:
కురుపాం, గరుగుబిల్లి, బలిజిపేట, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, పాచిపెంట, వేపాడ, సీతానగరం.
విశాఖపట్టణం జిల్లా:హుకుంపేట,అనంతగిరి, అరకులోయ.
చిత్తూరు జిల్లా:
పీలేరు , సదుం, కలికిరి, కలకడ, వాయల్పాడు, సోమాల, ఐరాల, పులిచెర్ల, గుర్రంకొండ, రామచంద్రపురం, ఏర్పేడు, నారాయణవనం, వెదురుకుప్పం
ప్రకాశం జిల్లా:
పామూరు , లింగసముద్రం, ఓలేటివారిపాలెం, పొన్నలూరు, పెదచెర్లోపల్లి, హనుమంతునిపాడు, తర్లుపాడు