ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతే లేదు – ఆక్సిజన్ కోసం వారు ఏం చేస్తున్నారంటే

ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతే లేదు - ఆక్సిజన్ కోసం వారు ఏం చేస్తున్నారంటే

0
93

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా కేసులతో జనం వణికిపోతున్నారు, ఇలాంటి వేళ ఆక్సిజన్ కొరత కూడా వేదిస్తోంది, ఏ ఆస్పత్రికి వెళ్లినా ఆక్సిజన్ కొరత వేధిస్తోంది….చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ లేక ప్రజల ప్రాణాలు పోతున్నాయి.. ఇలాంటి సమయంలో ఓ ఆస్పత్రి మాత్రం అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది.

 

ఆక్సిజన్ వినియోగంలో ఆదర్శంగా నిలుస్తోంది రాజస్థాన్ భిల్వారా ఆసుపత్రి. కేసులు పెరగడంతో ముందుగానే జాగ్రత్త పడ్డారు ఈ ఆస్పత్రిలోని వైద్యులు అధికారులు ..భిల్వారాని మహాత్మా గాంధీ జిల్లా ఆస్పత్రి ఇది..ఒక్క రోగికీ ఆక్సిజన్ అందకపోవడమన్నది ఇప్పటి వరకూ జరగలేదు. అయితే చాలా మంది రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్నా ఆక్సిజన్ లేదు అనే మాట వినిపించలేదు.. నిజంగా గ్రేట్ అనే చెప్పాలి

 

8 వేల మంది పేషెంట్లకు నిరంతరాయంగా ఆక్సిజన్ ను సరఫరా చేస్తూ శభాష్ అనిపించుకుంటోంది.

భిల్వారాలో 430 పడకల మహాత్మా గాంధీ జిల్లా ఆసుపత్రి ఉంది..అందులో 300 మంది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పరిస్దితి వస్తుంది అని భావించి ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ తొలి వేవ్ తో ఏర్పాటు చేయించారు.. ప్రతి రోజూ 100 సిలిండర్లకు పైగా ఆక్సిజన్ ను ఈ ప్లాంట్ ఉత్పత్తి చేస్తుందని తెలిపారు వైద్యులు.