టిక్ టాక్ మన దేశంలో మళ్లీ వస్తుంది అని అందరూ ఎదురుచూశారు ఇక ఉద్యోగులు ఇదే అనుకున్నారు కాని టిక్ టాక్ మళ్లీ వచ్చే అవకాశం లేనట్లే కనిపిస్తోంది, తాజాగా ఉద్యోగులకి కూడా చెప్పేసింది టిక్ టాక్ మరి ఆ స్టోరీ ఏమిటో చూద్దాం.
ఇండియాలో ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా 2000 మంది ఉద్యోగులను ఇప్పటి వరకూ పోషించింది, అయితే తాజాగా వారికి గుడ్ బై అంటూ ఇంటికి పంపించింది, ఇక మన దేశంలో టిక్ టాక్ శాశ్వతంగా నిషేదానికి గురి అయింది, దీంతో ఇక ఉద్యోగులకి మెయిల్ పంపిన టిక్ టాక్ యాజమాన్యం న్యూ ఇయర్ లో పెద్ద షాక్ ఇచ్చింది.
టిక్ టాక్ మాతృసంస్థ అయిన Byte Dance చాలా మంది ఉద్యోగులని పంపించేస్తోందట,ఇక కొందరు మాత్రమే ఉంటారు అని వార్తలు వస్తున్నాయి..సమాచార సేకరణ, సమాచార ప్రాసెసింగ్, సమాచార భద్రత, గోప్యత వంటి విషయాలపై మన కేంద్ర ప్రభుత్వం అడిగిన వాటికి సరైన సమాధానం ఆ కంపెనీలు చెప్పలేదు…59 యాప్ లపై శాశ్వత నిషేధం విధించారు..దీంతో చాలా కంపెనీల కార్యకలాపాలు మన దేశంలో నిలిచిపోయాయి.