ఇప్పుడు ఏపీకి రావాలి అంటే కచ్చితంగా మీరు స్పందనలో ఈపాస్ అప్లై చేసుకోవాలి.. ఆ తర్వాత మాత్రమే ఏపీకి రావాలి.. ఇది ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రూల్ …ఎవరైనా సరే ఇలా ఈపాస్ అప్లై చేసుకుని దానితో రావాలి.. లేదంటే బోర్డర్ లో నిలిపివేస్తారు, అయితే చాలా మంది ఇలా పాస్ లేకున్నా ఈజీగా వచ్చేద్దాము అని బయలుదేరుతున్నారు. వారిని బోర్డర్ లో నిలిపేస్తున్నారు పోలీసులు.
ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకే సరిహద్దులో చెక్‌పోస్టు దగ్గర అనుమతిస్తున్నారు. దీంతో పాస్‌ల కోసం జనాల దరఖాస్తుల వెల్లువలా వస్తున్నాయి.దీనిని కొందరు కేటుగాళ్లు ఆసరాగా చేసుకుని ఇందులో ఫేక్ పాసులు తయారు చేస్తున్నారు.
తాజాగా వీరిగుట్టు బయటపడింది..ప్రకాశం జిల్లాకు చెందిన మందా పవన్ కుమార్ హైదరాబాద్ ఉప్పల్‌లో ఓ కన్సల్టెన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు..పవన్ కుమార్ ఈ పాస్‌ల పేరుతో నకిలీ ఈపాస్‌లను సృష్టించాడు. అమాయకుల నుంచి డబ్బు వసూలు చేశాడు. ఇలా సుమారు 73 మంది నుంచి ఈపాస్ లు ఫేక్ వి పంపి డబ్బులు తీసుకున్నాడు, చివరకు అవి ఫేక్ అని తెలిసివారు.
కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకి తెలిపారు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసి.. డేకాయ్ ఆపరేషన్ ద్వారా ఎర వేసి పట్టుకున్నారు, నేరుగా మీరే స్పందన యాప్ లో అప్లై చేసుకోండి అంటున్నారు పోలీసులు, ఎవరిని దళారులని అప్రోచ్ అవ్వకండి.