ఈ ప్రాంతాల్లో లాక్ డౌన్ పెట్టం క్లారిటీ ఇచ్చిన ప్ర‌భుత్వాలు

ఈ ప్రాంతాల్లో లాక్ డౌన్ పెట్టం క్లారిటీ ఇచ్చిన ప్ర‌భుత్వాలు

0
82

ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ మ‌రోసారి ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ప్ రెన్స్ నిర్వ‌హించ‌నున్నారు, ఈ స‌మ‌యంలో కేసుల గురించి ఏఏ స్టేట్స్ లో కేసులు పెరుగుతున్నాయి, వీటికి కార‌ణాలు అన్నీ తెలుసుకుంటారు, అయితే దీని త‌ర్వాత మ‌ళ్లీ లాక్ డౌన్ అమ‌లు అవుతుంది అని చాలా వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

తాజాగా దీనిపై ప‌లు స్టేట్స్ క్లారిటీ ఇచ్చాయి, తాము లాక్ డౌన్ అమ‌లు చేయ‌ము అని తెలిపాయి.
మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇక దిల్లీలో లాక్ డౌన్ అమ‌లు చేయ‌ము అని అక్క‌డ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ తెలిపారు.

ఇక గుజరాత్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని కొట్టిపారేశారు. మా రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే కూడా మళ్లీ లాక్‌డౌన్‌ విధింపుపై స్పందించారు. మ‌హారాష్ట్రలో కూడా మ‌ళ్లీ లాక్ డౌన్ పెట్ట‌ము అని తెలిపారు.