యూపీలో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 ప్రారంభం కాగా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. తొలిదశలో మొత్తం 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా..623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఇందులో తొమ్మిది మంది మంత్రుల భవితవ్యం తేలనుంది. 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల అధికారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిదశ బరిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లోని 9 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో బహుముఖ పోరు నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ బరిలో.. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ- ఆర్‌ఎల్డీ, ఆప్, ఎంఐఎం పార్టీలు పోటీలో ఉన్నాయి. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి గురువారం నుంచి మార్చి 7 మధ్య ఏడు విడుతల్లో పోలింగ్ జరగనున్నాయి. మిగతా నాలుగు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, గోవాలో 14న, పంజాబ్‌లో 20న, మణిపూర్‌లో ఈ నెల 27, మార్చి 3న పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.