ఫ్లాష్..ఫ్లాష్..ఫ్లాష్- తెలంగాణలో భూకంపం

0
73

తెలంగాణలో మళ్లీ భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్లల్లో నుండి బయటకు పరుగులు తీశారు. అయితే కొద్ది రోజుల క్రితం కూడా తెలంగాణలో భూకంపం సంభవించింది. భూకంపాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోయినప్పటకీ..వరుస ప్రకంపనల వల్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ప్రకంపనలు ఆగుతాయా? కొనసాగుతాయా? అన్నది వేచి చూడాలి.

దేశంలోనే అత్యంత సురక్షిత ప్రదేశంగా దక్కన్ పీఠభూమిగా పేర్కొన్న తెలంగాణ రాష్ట్రం పేరొందింది.  తెలంగాణ, విదర్భలో భూకంపాలు వచ్చే తీవ్రత చాలా తక్కువ అని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. కానీ ఇప్పుడు తాజాగా తెలంగాణలో భూకంపాలు రావడం అందరినీ షాక్ కు గురి చేసింది.