తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ వైసీపీలో వర్గవిభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి… ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున రాపాక వరప్రసాద్ గెలిచారు… వైసీపీ ఆవిర్భవం నాటినుంచి పార్టీని నమ్ముకుని పని చేస్తున్న నేతలపై జనసేన నేతలు పెత్తనం చేస్తున్నారట…
వీరికి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే అలాగే మంత్రి సపోర్ట్ గా ఉన్నారట… 2019 ఎన్నికలసమయంలో వైసీపీకి చెందిన ఓ వర్గం జనసేన లో చేరింది… అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సంచలన మెజార్టీతో అధికారంలోకి రావడంతో జనసేనలోకి జంప్ చేసిన ఈ వర్గం తీరిగి వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చింది…
దీంతో పార్టీకి నమ్ముకుని ఉన్న నేతలపై వీరు పెత్తనం చేస్తున్నారు… దీనిపై పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాలని వైసీపీ నేతలు వాపోతున్నారు… మరి చూడాలి ఈ ఆదిపత్యానికి అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో…
—