చాలా మందికి కాక్ టెయిల్ అంటే చాలా ఇష్టం ఏదైనా కొత్త ప్రాంతాలకు వెళ్లినా అక్కడ దానిని ట్రై చేస్తూ ఉంటారు, అయితే ఇక్కడ ఈ విషయం ఎందుకో ఓసారి చూద్దాం. చాలా దేశాల్లో కోవిడ్ వల్ల ఇప్పుడు రెస్టారెంట్లు, హోటల్స్, బార్లలో రోబోలనే ఎక్కువగా వాడుతున్నారు. ఇక తాజాగా సింగపూర్ లో కూడా ఓ బార్ లో ఇలా ఓ రోబోని పెట్టారు. యజమాని దానిని ముద్దుగా
బార్ని అని పిలుస్తున్నారు.
దీని స్పెషాలిటీ ఏమిటి అంటే కాక్టైల్ కలపడం నుంచి కస్టమర్లకు జోకులు వినిపించే వరకు అన్ని పనులూ చకచకా చేస్తుంది.
ఇక దీని మరో స్పెషాలిటీ ఏమిటి అంటే ఇది ఏకంగా 16 రకాల స్పిరిట్ లు కలుపుతుంది… అందులో ఎనిమిది సోడాలు మిక్స్ చేస్తుంది. ఇలా చాలా రకాల టేస్ట్ ఉండే కాక్ టెయిల్స్ తయారు చేస్తుంది.
ఇక కస్టమర్లు మొబైల్ ద్వారా ఆర్డర్ ఇస్తే వాటిని కూడా ఒకే చేస్తుంది, ఇలా మనిషి కంటే పది రెట్లు పని చేస్తోంది ఈ రోబో.. ఇక కస్టమర్ల మూడ్ బట్టీ జోకులు వేస్తూ నవ్విస్తుంది…. ఇక ఈ బార్ కు ది బార్ని బార్ అనే పేరు వచ్చింది. మరి ఈ రోబోని ఎవరు తయారు చేశారు అనేది చూస్తే .ఎఫ్&పి రోబోటిక్స్ అనే సంస్థ దీనిని డవలప్ చేసింది, ఇక ఇప్పటికే చాలా షాపింగ్ మాల్స్ లో కూడా వీటిని వాడుతున్నారు.