ఈ కరోనాతో మన దేశంలో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారంటే

ఈ కరోనాతో మన దేశంలో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారంటే

0
111

ఈ కరోనా చాలా కుటుంబాలను రోడ్డు పాలు చేసింది.. చిన్న ఉద్యోగి నుంచి పెద్ద ఉద్యోగి వరకూ అందరూ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు, అయితే చాలా కంపెనీలు ఉద్యోగులకి గుడ్ బై చెబుతున్నాయి, ఇక ఖర్చులు తగ్గించుకునే ఆలోచనతో ఉద్యోగుల జీతాలలో భారీగా కోతలు విధిస్తున్నాయి.

అయితే చిన్న పరిశ్రమలు మూతపడటంతో చాలా మందికి ఉపాధి లేదు, అయితే మన దేశంలో ఏప్రిల్ నుంచి భారీగా ఉద్యోగాలు కోల్పోయారు ఉద్యోగులు….మే, ఆగస్ట్ నెలలో 60 లక్షల మంది వైట్ కాలర్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు.

ముఖ్యంగా ఐటీ టీచింగ్ అకౌంట్స్ అనలిస్ట్ , టూరిస్ట్ ఉద్యోగాలు ఆతిధ్య రంగసంస్ధల్లో భారీగా ఉద్యోగాలు కోల్పోయారు..ఈ కరోనా దెబ్బకి సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మరో ఆరు నెలలకు భారీగా రిక్రూట్ మెంట్లు జరుగుతాయి అని అప్పటి వరకూ ఈ పరిస్దితి ఉంటుంది అని అంటున్నారు అనలిస్టులు.